ఆర్థిక శాస్త్రం – సాధారణ మనిషికి అర్థమయ్యే విధంగా
భాగం 6 – ధర మారితే ప్రభావం ఎంత? (Elasticity)
గత భాగంలో మనం తెలుసుకున్నాం — ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది.
కానీ ప్రశ్న ఏమిటంటే — ఎంత తగ్గుతుంది?
కొన్నివస్తువుల డిమాండ్ ఎక్కువగా మారుతుంది.
కొన్నివస్తువుల డిమాండ్ చాలా తక్కువగా మారుతుంది.
ఈ మార్పు పరిమాణాన్నే Elasticity అంటారు.
ఉప్పు ఉదాహరణ
ఉప్పు ధర ₹20 నుండి ₹30కి పెరిగిందనుకుందాం.
మనం ఉప్పు కొనడం ఆపేస్తామా?
కాదు.
ఎందుకంటే ఉప్పు అవసరం.
ఉప్పు డిమాండ్ ఎక్కువగా మారదు.
దీనిని తక్కువ Elasticity అంటారు.
బంగారం ఉదాహరణ
బంగారం ధర ₹5,000 పెరిగిందనుకుందాం.
చాలామంది కొనడం వాయిదా వేస్తారు.
బంగారం డిమాండ్ ఎక్కువగా మారుతుంది.
దీనిని ఎక్కువ Elasticity అంటారు.
సాధారణంగా గుర్తుంచుకోవాలి
- అవసరమైన వస్తువులు → తక్కువ మార్పు
- లగ్జరీ వస్తువులు → ఎక్కువ మార్పు
ధర మారితే ప్రజల ప్రవర్తన ఎంత మారుతుందో — అదే Elasticity.
అవసరం ఎక్కువైతే ధర ప్రభావం తక్కువ. అవసరం తక్కువైతే ధర ప్రభావం ఎక్కువ.
— Shaktimatha Learning
No comments:
Post a Comment