73వ రాజ్యాంగ సవరణ చట్టం – పంచాయతి రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ స్థానం
Indian Constitution | Local Self Government | Rural Democracy
1. 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)
భారతదేశంలో గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలపరచడానికి 1992లో 73వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చింది.
ఈ సవరణ ద్వారా పంచాయతి రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన గుర్తింపు లభించింది.
2. రాజ్యాంగంలో కొత్త భాగం
73వ సవరణ ద్వారా రాజ్యాంగంలో Part IX అనే కొత్త భాగాన్ని చేర్చారు.
ఈ భాగంలో పంచాయతీలకు సంబంధించిన అంశాలను వివరించే ఆర్టికల్స్ ఉన్నాయి.
- Article 243
- Article 243A – గ్రామ సభ
- Article 243B – పంచాయతీల ఏర్పాటు
- Article 243C – పంచాయతీల నిర్మాణం
- Article 243D – రిజర్వేషన్లు
- Article 243E – పంచాయతీల కాలపరిమితి
- Article 243F – సభ్యుల అర్హతలు
3. 11వ షెడ్యూల్
73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్ను కూడా చేర్చారు.
ఈ షెడ్యూల్‌లో 29 అంశాలు ఉన్నాయి. ఈ అంశాలపై పంచాయతీలు పని చేయవచ్చు.
ఉదాహరణలు:
- వ్యవసాయం
- గ్రామ అభివృద్ధి
- నీటి సరఫరా
- రోడ్లు
- ఆరోగ్యం
- పేదరిక నిర్మూలన
4. 73వ సవరణ ముఖ్య లక్ష్యం
- గ్రామ స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలపరచడం
- స్థానిక స్వయంపాలనను ప్రోత్సహించడం
- ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం
- గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడం
ఈ సవరణ భారతదేశంలో గ్రామ స్థాయి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలిచింది.
No comments:
Post a Comment